యాంకర్ పై మనసు పడ్డ విశ్వక్ సేన్.. ఏమని కామెంట్ చేశాడో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎవరో ఛాన్సులు ఇస్తారు ఎవరో తన కెరీయర్ని నిలబెడతారు అని వేచి చూడకుండా.. తానే డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గా మారి ఇక తానే హీరోగా నటించి సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలోనే విశ్వక్సేన్ హీరోగా నటించిన ఫలక్నుమా దాస్ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఈ మూవీతో మాస్కా దాస్ అనే ఒక ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు విశ్వక్సేన్.

 ఇక ఇటీవల కాలంలో డిఫెరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లు కొడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు అతను హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగా ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతోపాటు గామి అనే మూవీ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అని భారీగానే అంచనాలను పెట్టుకున్నాడు అని చెప్పాలి.

 అయితే ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ స్రవంతికి ఫిదా అయిపోయాడు ఈ హీరో. ఇంటర్వ్యూలో స్రవంతిని పొగుడుతూ కామెంట్స్ చేశాడు. చాలా బాగుంది అంటూ స్రవంతి ఏదో చెప్పబోతుంటే ఇంతలోనే మీరు ఈ మధ్య హీరోయిన్స్ కన్నా మంచి చీరలు కడుతున్నారు అంటూ కామెంట్ చేశాడు విశ్వక్సేన్. ఆమె థాంక్స్ చెప్పి నవ్వింది. ఈ వీడియో చూసిన వారందరూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో నీ కన్ను ఆమెపై పడిందా.. ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయినట్టే   అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. విశ్వక్సేన్ ఆ హీరోయిన్ కి ఫిదా అయిపోయినట్టున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: