టీమిండియాలో.. ఇంత త్వరగా ఛాన్స్ వస్తుందనుకోలేదు : ఆకాష్

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ అదరగొట్టేస్తున్నారు. ఇక దేశవాళి క్రికెట్లో ఇక పరుగుల వరద పారిస్తున్న ఎంతోమంది ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చేస్తున్నారు. ఇక దేశవాళి టోర్నిలలో తమ బౌలింగ్ ప్రతిభతో ఎక్కువగా వికెట్లు పడగొడుతూ ఇక భారత సెలెక్టర్ల చూపుని  ఆకట్టుకుంటున్నారు ఎంతోమంది. దీంతో ఇటీవల కాలంలో భారత జట్టులో యువ ఆటగాళ్లదే ఎక్కువగా ఆవా పెరిగిపోయింది అని చెప్పాలి.

 ఇలా టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్న వారు తమ సత్తా ఏంటో తక్కువ సమయంలోనే నిరూపించుకుని ఇక భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇక భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లకు సంబంధించిన జట్టు వివరాలను  ప్రకటించింది. అయితే మిగిలిన మూడు టెస్టులకు సంబంధించిన వివరాలను మాత్రం ఇటీవల విడుదల చేసింది. కాగా మరోసారి యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేశారు భారత సెలెక్టర్లు. ఇటీవలే మూడు టెస్టులకు సెలెక్ట్ చేసిన టెస్ట్ జట్టులో యంగ్ ప్లేయర్ ఆకాష్ దీప్ కి కూడా ఛాన్స్ దక్కింది.

 ఈ క్రమంలోనే భారత జట్టులో చోటు దక్కడం గురించి ఆకాష్ దీప్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత త్వరగా టెస్ట్ ఫార్మాట్లో ఆడే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ దీప్. ఇంగ్లాండ్ తో చివరి మూడు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో ఇతనికి చోటు దక్కడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కాగా 2019లో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశదీప్ 29 మ్యాచ్లలో 105 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ లలో 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: