మొన్నే విడాకులు.. అంతలోనే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న షోయబ్?

praveen
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమ పెళ్లి కాస్త చివరికి విడాకులతో విడిపోయింది అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చివరికి కోర్టుమెట్లు ఎక్కి విడాకులు తీసుకుని తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకుల విషయం వార్తల్లో ఎంతలా సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత ఏడాది నుంచి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

 ఇక ఇద్దరూ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వేరువేరుగా హాజరవుతూ ఉండడంతో ఇక ఈ వార్తలుకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పాలి. దీంతో ఇక సానియా, షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి రాగా.. ఇద్దరు మాత్రం స్పందించలేదు. కానీ ఇటీవల ఏకంగా షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారిపోవడం.. అంతలోనే సానియా  ఏకంగా తాను షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. అయితే విడాకుల తర్వాత సానియా మీర్జా ఇక వైవాహిక బంధంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే మొన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్ ఇక పాకిస్తాన్ నటి సనా జావిద్ ని మూడో వివాహం చేసుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఏకంగా మూడో భార్యతో షోయబ్ హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి సనాజావేద్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు ఇక ఆ ఫోటోలలో కనిపిస్తుంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దేశం మొత్తం విమర్శలు వస్తున్న సానియా షోయబ్ ప్రేమ కోసం పాకిస్తాన్ వెళ్తే.. షోయబ్ మాత్రం సానియాని దారుణంగా మోసం చేశాడు అంటూ ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: