మొన్నే జట్టులోకి వచ్చాడు.. అంతలోనే మళ్ళీ దూరం?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ పేర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎప్పుడు ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఫుల్ ఫామ్ లో కొనసాగాలని ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఊహించనీ రీతిలో గాయాల బారిన పడి జట్టుకు దూరమవడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ పట్టుదలతో మళ్ళీ గాయం నుంచి కోలుకొని ఇక జాతీయ జట్టులోకి రావడం చేస్తూ ఉంటారు. అయితే కేన్ విలియమ్సన్  విషయంలో కూడా ఇదే జరిగింది. కొన్ని రోజుల నుంచి గాయం కారణంగా అంటున్న జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.

 కానీ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం మళ్ళీ అతను జట్టులోకి వచ్చాడు. అయితే రావడం సెంచరీ తో చలరేగిపోయాడు కేన్ విలియంసన్. దీంతో అతని ఫామ్ చూసి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన తర్వాత అతను ఎలా రాణిస్తాడు అని అందరూ అనుమాన పడినప్పటికీ అందరికి అంచనాలను తారుమారు చేస్తూ విలియంసన్ మరోసారి తన ఫామ్ నిరూపించుకున్నాడు. అయితే ఇక ఇలా కేన్ విలియంసన్ జట్టులోకి వచ్చాడు అని అభిమానులు అందరూ కూడా ఆనందపడుతున్న వేళ.. అంతలోనే మరోసారి టీం కి దూరం అవ్వబోతున్నాడు ఈ స్టార్ ప్లేయర్.

 ఈనెల 21వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడబోతుంది  న్యూజిలాండ్ జట్టు. కాగా ఈ సిరీస్ కి న్యూజిలాండ్ ప్లేయర్ కేఎన్ విలియమ్సన్ దూరం కాబోతున్నాడట. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ స్టెడ్ పేర్కొన్నారు. కేన్ విలియంసన్ భార్య గర్భవతి కావడంతో సిరీస్ కు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఆయన స్థానాన్ని ట్రెండ్ బౌల్డ్ తో భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు న్యూజిలాండ్ హెడ్ కోచ్. ఇక మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ వెల్లడించారు. కాగా కేం విలియమ్సన్  దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం తెలియడంతో అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: