ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. వార్నర్ అరుదైన రికార్డు?

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ దాదాపు దశాబ్ద కాలం నుంచి అదరగొడుతున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం రిటైర్మెంట్ స్టేజికి దగ్గరలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ క్రికెట్ కెరియర్ కి కూడా వీడ్కోలు ప్రకటిస్తూ డేవిడ్ వార్నర్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం కేవలం పొట్టి ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది జూన్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్ ఇక ఈ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున వరుసగా టి20 మ్యాచ్ లు ఆడుతూ అదరగొడుతూ ఉన్నాడు ఈ సార్ ప్లేయర్. అదే సమయంలో తన ప్రదర్శనతో ఎన్నో అరుదైన రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అటు వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. అయితే మొదటి టీ20 మ్యాచ్ లో తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు డేవిడ్ వార్నర్. 36 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. ఇక మొదటి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా మొదటి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినా.. ఇక తన ప్రదర్శన ద్వారా కాకుండా మ్యాచ్ ఆడటం ద్వారా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు డేవిడ్ వార్నర్. ఏకంగా ఆస్ట్రేలియా తరపున అన్ని ఫార్మాట్లలో కూడా 100 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ గా నిలిచాడు. అతను ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పుడు వరకు 112 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక వన్డే ఫార్మట్ లో 161 మ్యాచ్లు ఆడాడు. ఇక టి20 ఫార్మట్ లో ఇటీవల జరిగిన తొలి మ్యాచ్ తో 100 t20 లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇక ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా నిలిచాడు డేవిడ్ వార్నర్   అతనికంటే ముందు న్యూజిలాండ్ ప్లేయర్ రాజ్ టైలర్, ఇండియా ప్లేయర్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: