కన్ఫ్యూజన్లో పడ్డ అంపైర్.. ఏం చేసాడో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు?

praveen
క్రికెట్ ని ఫన్నీ గేమ్ అని అభివర్ణిస్తూ ఉంటారు విశ్లేషకులు. ఇక ఇలా ఎవరైనా అన్నారు అంటే ఊరుకోండి బాసూ క్రికెట్ మ్యాచ్లు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతూ ఉంటే.. మీరు ఫన్నీ గేమ్ అంటారేంటి అంటారు ఎవరైనా. కానీ అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్లలో జరిగే ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారి క్రికెట్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డాయి అంటే చాలు నిజమే బాసు ఫన్నీ గేమ్ అంటే ఏమో అనుకున్నా గానీ మరీ ఇంత ఫన్నీ అని అనుకోలేదు అంటూ అభిప్రాయపడుతూ ఉంటారు.

 సాధారణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో చాలాసార్లు ఫీల్డర్లు ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తూ నవ్వుల పాలు అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఫీల్డర్లు  ఇలా చేస్తూ ఉంటారు. కానీ అటు ఎంపైర్లు మాత్రం ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. ప్రతి పనిని కూడా ఎంతో క్షుణంగా పరిశీలిస్తూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి ఎంపైర్ ఇటీవలే ఏకంగా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కి కారణం అయ్యాడు. ఏకంగా రిప్లై చూసిన తర్వాత థర్డ్ అంపైర్ నాట్ అవుట్ గా ఇచ్చినప్పటికీ.. అటు ఫీల్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ అంటూ ప్రకటించాడు అని చెప్పాలి. దీంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.

 ఈ ఘటన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ లో చోటుచేసుకుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్లో జరిగింది ఈ ఘటన. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 26 ఓవర్ ను ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లి గార్డెనర్ వేసింది. సఫారీ బ్యాటర్ సున్ లూజ్ స్వీప్ షాట్ ఆడింది. అయితే బంతి బ్యాట్ కు తాకలేదు. ప్యాడ్ లకు తాకింది. దీంతో ఆసీస్ ప్లేయర్ ఎల్ బి డబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ ఎంపైర్ కైర్ పోలో సాక్ నాట్ అవుట్ ఇచ్చింది. దీంతో ఆసీస్ ప్లేయర్లు రివ్యూ కి వెళ్లారు. థర్డ్ ఎంపైర్ అంతా పరిశీలించి నాటౌట్ గా ప్రకటిస్తే.. ఫీల్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ గా ప్రకటించింది. తర్వాత తప్పు తెలుసుకుని ఇక మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: