నా కూతురు బాగా గుర్తొస్తుంది.. కానీ ఆమె చూపించడం లేదు : షమి

praveen
ప్రస్తుతం టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో భారత జట్టులో యువ ఆటగాళ్ల హవా ఎక్కువ అవ్వటంతో ఎంతో మంది సీనియర్ క్రికెటర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. కానీ ఇక ఎప్పటినుంచో భారత జట్టుకు ఆడుతూ వస్తున్న షమీ మాత్రం ఎప్పటికప్పుడు తనను తాను  కొత్తగా నిరూపించుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు అని చెప్పాలి. కొత్త ప్రతిభ కంటే అనుభవం ఉన్న షమీ ప్రతిభనే బెటర్ అని సెలెక్టర్లకు అనిపించేలా అతను సత్తా చాటుతూ ఉన్నాడు.

 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో షమీ ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టోర్నీ మధ్యలో తుది జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ.. వరల్డ్ కప్ లో టాప్ వికెట్ టేకర్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇలా క్రికెట్లో సక్సెస్ అయిన షమీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఏకంగా అతని భార్య అతనిపై కేసు పెట్టింది. వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. అక్రమ సంబంధాలు పెట్టుకుని తన మోసం చేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.

 ఇక ఇలాంటి ఘటనల నేపథ్యంలో అతని కెరియర్ వెనుకబడిపోయింది. డిప్రెషన్ లోకి వెళ్లి జట్టులో చోటు కోల్పోయాడు. ఇలాంటి సమయంలో ఇక దృఢ సంకల్పంతో మళ్లీ ఆటపై దృష్టి పెట్టిన మహమ్మద్ షమీ.. ఇక ఇప్పుడు తిరుగులేని క్రికెటర్ గా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టాడు ఈ స్టార్ క్రికెటర్. తన కూతురు ఐరాను బాగా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆమెతో కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎంత ప్రయత్నించినా ఐరాను చూడటానికి కుదరడం లేదు. దీనికి అంతటికి కారణం నా మాజీ భార్య హసీనానే. ఆమె కావాలని నా కూతురుని నాకు చూపించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2014లో హసీనాను పెళ్లి చేసుకున్న షమి 2018లో విడాకులు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: