దుర్గాదేవి ఆశీర్వాదం తీసుకొని మరి.. ప్రాక్టీస్ మొదలెట్టిన తలైవా?

praveen
2024 ఐపిఎల్ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది బీసీసీఐ.. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్లో మినీ వేలం ప్రక్రియ కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. మార్చ్ నెలలో ఇక ఐపీఎల్ టోర్ని ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ కి ముందు అదే ఫార్మాట్లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఆడాలని సత్తా చాటాలని ఎంతోమంది ఆశ పడుతున్నారు. ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శన చేసి ఇక వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇప్పటికే కొంతమంది ప్లేయర్లు దేశవాలి క్రికెట్లో సత్తా చాటుతూ ఉంటే ఇంకొంతమంది అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ లు ఆడుతూ అదరగొట్టేస్తున్నారు. అయితే క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికి కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని ఇక 2024 ఐపిఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టేసాడు. రాంచీలో ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు మహేంద్ర సింగ్ ధోని. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్ అన్న విషయం తెలిసిందే.

 రాంచి లోని దేవ్ రీ ఆలయాన్ని సందర్శించుకున్న మహేంద్రసింగ్ ధోని.. ఇక ఇటీవల తన బ్యాటింగ్ ప్రాక్టీస్ ని మొదలు పెట్టాడు అని చెప్పాలి. అయితే ముఖ్యమైన పనులు చేసే ముందు ఈ ఆలయాన్ని దర్శించుకుని దుర్గాదేవి ఆశీస్సులు తీసుకోవడం మహేంద్ర సింగ్ ధోనీకి ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. అయితే గత ఏడాది మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. దీంతో ధోని ఇక 2024 ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండడని రిటర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరూ అనుకున్నప్పటికీ.. మరో సీజన్ ఆడేందుకు రెడీ అయ్యాడు మహేంద్రుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: