చరిత్ర సృష్టించిన బుమ్రా.. అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు బుమ్రా. టీమిండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన అతను తప్పకుండా భారత జట్టులో చోటు సంపాదించుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ ద్వారా టీం ఇండియాలోకి వచ్చిన బుమ్రా అతి తక్కువ సమయంలోనే భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్న జట్టుకు కెప్టెన్ గా ఉన్న ప్లేయర్ ఇక బుమ్రా చేతికి బంతిని అందిస్తూ ఉంటాడు. అంతలా అతనిపై నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక ప్రతిసారి కూడా నమ్మకాన్ని నిలబెడుతూ బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ అదరగొడుతూ ఉంటాడు బుమ్రా. అంతేకాదు టీమ్ ఇండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా.. భారత జట్టులో మరోసారి అతను కీలక ప్లేయర్గా సత్తా చాటుతూ ఉన్నాడు. ఇటీవల విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అన్న విషయం తెలిసిందే. రెండు టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు చేసి ఆకట్టుకున్న బుమ్రా ఇక రెండో ఇన్నింగ్స్ లో మూడు టికెట్లు తీసి సత్తా చాటాడు .

 ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మొత్తంగా తొమ్మిది వికెట్లు తీయడంతో ఇంగ్లాండు పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో భారత ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. 1986లో భారత ప్లేయర్ చేతన్ శర్మ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక ఆ తర్వాత ఇక ఈ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా ఎవరు రాలేదు. అయితే ఇటీవల ఏకంగా తొమ్మిది వికెట్లు తీసిన చేతన్ శర్మ తర్వాత ఇంగ్లాండ్ పై అత్యుత్తమ ప్రదర్శన ఫేస్ బౌలర్గా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: