రోహిత్ చెత్త ప్రదర్శన.. అయినా ధోనీని వెనక్కి నెట్టాడు?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండు టీం ఇండియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది. ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండు జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ మ్యాచ్లలో పోరు హోరాహోరీగా జరుగుతూ ఉంది. అయితే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియాను సొంత గడ్డమీద ఓడించి ఇంగ్లాండ్ టీం సత్తా చాటింది. అయితే ఈ ఓటమితో నిరాశ చెందిన టీమిండియా అటు రెండో టెస్టు మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది.

 ఈ క్రమంలోనే విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారీ పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1 తో సమం అయింది. ఇక మరో మూడు మ్యాచ్లలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది తేలబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో అటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే దారుణంగా విఫలమైన రోహిత్.. రెండు టెస్టు మ్యాచ్లోనూ అలాంటి ఆట తీరుతోనే నిరాశపరిచాడు.

 అయితే రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన విషయంలో విఫలమైనప్పటికీ అటు ఎన్నో రికార్డులు మాత్రం అతనికి ఖాతాలో చేరిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మహేంద్రసింగ్ ధోనిని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక విజయాలలో పాలుపంచుకున్న భారత క్రికెటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు రోహిత్. భారత్ విజయం సాధించిన 296 మ్యాచ్లలో రోహిత్ శర్మ సభ్యుడుగా ఉన్నాడు. అయితే ధోని 295 ను వెనక్కి నేట్టాడు. కాగా 313 మ్యాచ్ల విజయాలలో పాలుపంచుకొని విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. 307 విజయాలతో టీమిండియాలో సభ్యుడుగా ఉన్న ఆటగాడిగా సచిన్ రెండవ స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: