చెత్త ప్రదర్శన చేసినా.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతూ ఉంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా టీమిండియా కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటాడని అందరూ ఊహించారు. కానీ మొదటి టెస్ట్ మ్యాచ్ నుంచి కూడా అతను ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. కనీసం విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో అయినా ఆకట్టుకుంటాడు అనుకున్నప్పటికీ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

 రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 13 పరుగులు.. ఇక రెండో ఇన్నింగ్స్ లో 14 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు రోహిత్ శర్మ. దీంతో అతని బ్యాట్ నుంచి భారీగా పరుగులు ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పేలువ ప్రదర్శనతో రోహిత్ శర్మ నిరాశ పరిచినప్పటికీ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డులు మాత్రం రోహిత్ బద్దలు కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచి రికార్డు సృష్టించాడు.

 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 36 మ్యాచ్లలో 60 ఇన్నింగ్స్ లలో 39.21 సగటుతో విరాట్ కోహ్లీ 2235 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ స్కోరు 254 కావడం గమనార్హం. అయితే రోహిత్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. 29 మ్యాచులలో 49 ఇన్నింగ్స్ లలో 49.82 సగటుతో 2042 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్ గా నిలిచారు.  రోహిత్ చేసిన పరుగులలో ఏడు సెంచరీలు ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. రోహిత్ శర్మ అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ 212 పరుగులు కావడం గమనార్హం. మొత్తంగా ఈ లిస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ 423 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడుగా టాప్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: