గిల్ కు అల్టిమెట్టం.. బీసీసీఐ వార్నింగ్?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో ఎంత తీవ్రమైన పోటీ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో చోటు సంపాదించుకోవడం కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దేశవాళి క్రికెట్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక భారత తుది జట్టులో చోటు సంపాదించుకున్న ఎవరైనా ప్లేయర్ మంచి ప్రదర్శన చేయలేదు అంటే ఏకంగా వారిని నిర్మొహమాటంగా సెలెక్టర్లు పక్కన పెట్టడం కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం.

 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు మినహా మిగతా అందరు ప్లేయర్ల విషయంలో కూడా బీసీసీఐ సెలెక్టర్లు ఇలాంటి తరహా ఫార్మూలానే ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న గిల్ విషయంలో కూడా ఇలాంటిదే చేశారట బీసీసీఐ సెలక్టర్లు. గిల్ అటు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్ లో కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఇక రెండో మొదటి ఇన్నింగ్స్ లో కూడా అదే తీరు ప్రదర్శనతో ఆగ్రహం తెప్పించాడు. దీంతో బిసిసిఐ సెలెక్టర్లు అతనికి అల్టిమేట్ జారీ చేశారట. రెండో టెస్ట్ మ్యాచ్లో గీల్ ప్రదర్శన బాగోకపోతే.. అతడికి ఇదే చివరి టెస్ట్ అని మేనేజ్మెంట్ హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గిల్ తన కుటుంబీకులకు కూడా చెప్పాడట. ఒకవేళ రెండో మ్యాచ్ లో విఫలమై ఉంటే ఇక విశాఖ నుంచి పంజాబ్ కు వెళ్లి రంజి మ్యాచ్లో ఆడాల్సి ఉండేదని కుటుంబీకులకు తెలిపాడట గిల్.


కానీ రెండో టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్ లో మాత్రం గిల్ ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు. దీంతో ఇక అతను మిగతా టెస్ట్ మ్యాచ్ లలో కూడా కొనసాగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: