మనకి ఇలాంటి పిచ్ లు అవసరమా.. సౌరబ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంతకాల నుంచి భారత్ లో ఉన్న పిచ్ లపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా బీసీసీఐ తమ జట్టుకు అనుకూలంగా ఉండే విధంగా ఇక టర్నింగ్ పిచ్ లను రెడీ చేసుకుంటుంది అంటూ కొంతమంది విదేశీ మాజీ ప్లేయర్లు విమర్శలు చేశారు. అయితే ఇలాంటి విమర్శలకు భారత ఆటగాళ్లు కూడా మంచి కౌంటర్ ఇచ్చారు అని చెప్పాలి. అయితే ఇలా భారత జట్టుకు అనుకూలంగా ఉండే పిచ్ లని బీసీసీఐ రెడీ చేస్తుంది అని గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో చర్చ జరుగుతున్న వేళ.. ఇదే విషయం గురించి మాజీ బీసీసీఐ మాజీ బాస్  సౌరవ్ గంగూలీ స్పందించాడు.

 ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా బౌలర్లు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా రెండు వైపుల బంతిని స్వింగ్ చేస్తూ అటు ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ ఉన్నారు. ఇక భారత బౌలర్లు సంధిస్తున్న బంతులకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానమే లేకుండా పోతుంది అని చెప్పాలి. దీంతో ఇక వరుసగా వికెట్లు పడగొడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇక భారత పిచ్ ల గురించి మాట్లాడిన సౌరబ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ ను మంచి వికెట్ పై ఆడాలి అంటూ సౌరబ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

 ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా, శమీ, సిరాజ్, ముకేష్ లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇక భారత్లో టర్నింగ్ ట్రాక్లు ఎందుకు రెడీ చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. అయితే ఇలాంటి ట్రాక్ లు కావాలి అనడం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ లు ఏ పిచ్ పై అయినా సరే 20 వికెట్లు పడగొట్టగలరు. అనుకూలమైన పిచ్ లను తయారు చేయడం వలన బ్యాటింగ్ నాణ్యత లోపిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సౌరబ్ గంగూలీ. ఇటీవల రెండో టెస్ట్ మ్యాచ్లు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన అనంతరం సౌరబ్ గంగూలీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: