ఇంగ్లాండ్ ప్లేయర్లకు.. ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ స్పెషల్ గా ఆ ఫుడ్ పెట్టిందట తెలుసా?

praveen
బిర్యానీ.. ఈ పేరు వినిపించింది అంటే చాలు నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా నోరూరిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే బిర్యానీకి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే బిర్యానీ అంటే చాలు ఆహార ప్రియులందరూ కూడా లొట్టలేసుకుంటూ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది సరే గానీ ఇక ఇప్పుడు బిర్యానీ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 అవును జరుగుతుంది.. ఇంగ్లాండు టీం ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ కి.. మనం మాట్లాడుకుంటున్న బిర్యాని కి అసలు ఏంటి సంబంధం అంటారా.. బిర్యానీ రుచి అంటే ఎలా ఉంటుందో తెలియని ఇంగ్లాండ్ ప్లేయర్లందరికీ కూడా ఇటీవల అసలు సిసలైన బిర్యాని రుచి చూపించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. సాధారణంగా ఇలా స్వదేశీ పర్యటనకు వచ్చిన విదేశీ ఆటగాళ్లకు అద్భుతమైన ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ ఉండే స్పెషల్ ఫుడ్స్ అన్నింటినీ కూడా ఆటగాళ్ల కోసం తీసుకురావడం చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు విశాఖకు వచ్చింది.

 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరికీ కూడా విశాఖలోని వాతావరణం, రుచులను ఆస్వాదించేలా ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు స్పెషల్ మటన్ బిర్యానీని తీసుకొచ్చారట. ఇక ఇటీవల ఈ వంటకాన్ని కూడా వడ్డించారట. అయితే ఈ విషయాన్ని ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. దీంతో ఇక తెలుగు రుచులను ఆస్వాదించండి అంటూ నేటిజన్స్ అందరు కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: