జైష్వాల్ అరదైన రికార్డ్.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మూడో ప్లేయర్?

praveen
యశస్వి జైష్వాల్.. ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన పేరు. ఎందుకంటే అతను టీమ్ ఇండియా జట్టు తరఫున అరంగేట్రం చేసిన నాటి నుంచి కూడా ప్రతి మ్యాచ్లో అదరగొట్టేస్తూ ఉన్నాడు. ఇక అతని విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఏకంగా ప్రత్యర్థులకు సైతం ముచ్చమటలు పట్టిస్తున్నాడు. ఏకంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు సైతం తక్కువ పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోతున్న సమయంలో.. అటు యశస్వి జైష్వాల్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ఆట తీరుపై ప్రశంసల వర్షం కూడా కురుస్తూ ఉంది.

 అయితే ఇక తాను భారత క్రికెట్కు ఫ్యూచర్ అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తూ ఉన్నాడు యశస్వి జైష్వాల్. ఇటీవల అటు ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇదే చేసి చూపించాడు అన్న విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులకు వికెట్లు కోల్పోయారు  ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో ఏకంగా డబుల్ సెంచరీ తో చెలరేగి పోయిన యశస్వి జైష్వాల్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

 ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించాడు అని చెప్పాలి. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా 209 పరుగులు చేసిన జై శ్వాల్.. అతి తక్కువ వయసులోనే ద్విశతకం సాధించిన మూడో భారత ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 22 ఏళ్ళ 37 రోజుల వయసులోనే ఇలా డబుల్ సెంచరీ అందుకున్నాడు జైష్వాల్. అయితే 1993లో వినోద్ కాంబ్లీ 21 ఏళ్ళ 32 రోజుల వయసులో ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ చేసి ఇక ఈ లిస్టులో టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 21 ఏళ్ళ 271 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ లెజెండ్స్ తర్వాత ఇప్పుడు యశస్వి జైస్వాల్  అతి చిన్న వయసులోనే ఈ ఘనతను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: