మరణ వార్త చెవిన పడగానే.. కామెంట్రీ బాక్స్ నుంచి వెళ్లిపోయిన గవాస్కర్?

praveen
ఇండియా లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దీంతో క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం తెర మీదకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెటర్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులందరూ కూడా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ఇలాంటి విషయం ఏదైనా తెర మీదకి వస్తే ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

 అయితే ఇక ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కు సంబంధించిన ఇలాంటి ఒక వార్త వైరల్ గా మారి పోయింది. సునీల్ గవాస్కర్ దాదాపు దశాబ్ద కాలం పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. తన ఆట తీరుతో ఎంతగానో సేవ చేశారు. ఈ క్రమం లోనే భారత క్రికెట్ చరిత్ర  లో లెజెండ్స్ లో అతను ఒకరిగా మారి పోయారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. కామెంటేటర్ గా మారి తన గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను మరింత ఉత్కంఠ భరితం గా మార్చుతున్నారు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కి గవాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భం గా కామెంట్రీ చేస్తున్న సునీల్ గావస్కర్  అకస్మాత్తుగా కామెంట్రీ బాక్స్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయన అత్తయ్య పుష్ప మెహత మరణ వార్త అందడంతో చివరికి వెంటనే ఇక కామెంట్రీ ఆపేసి గవాస్కర్ ఇంటికి వెళ్లిపోయారు అన్నది తెలుస్తోంది ఈ క్రమంలోనే తన భార్యతో కలిసి వెంటనే కాన్పూర్ బయలుదేరారు సునీల్ గావస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: