కరోనా సోకినా.. బ్యాటింగ్లో దంచికొట్టాడు?

praveen
కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచదేశాలలో ఎంతల ప్రకంపనలు  సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ప్రపంచ దేశాలు అన్ని కూడా ప్రాణ భయంతో వనికి పోయాయి. చైనా నుంచి పాకిపోయిన ఈ వైరస్ ఏకంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ఇక ప్రపంచం మొత్తం కనిపించని మహమ్మారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అనే ముసుగు వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ విజృంభన  సమయంలో కూడా క్రికెట్లో అనూహ్యమైన  ఘటన జరిగాయి.

ఎప్పుడు వరుస మ్యాచ్లతో బిజీ బిజీగా ఉండే క్రికెటర్లు.. ఇక కొన్ని నెలలపాటు ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తర్వాత కాలంలో కొన్ని పరిమితుల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఎవరైనా ఆటగాడు కరోనా వైరస్ బారిన పడితే అతన్ని జట్టు నుంచి తప్పించి ఐసోలేషన్ సెంటర్కు పంపించేవారు. అయితే ఇక ఇప్పుడు కూడా చాలా టీమ్స్ ఇలాంటి రూల్స్ ని ఫాలో అవుతున్నాయి. కానీ ఇటీవల ఆస్ట్రేలియా ఏకంగా సాహసం చేసింది అని చెప్పాలి. ఏకంగా కరోనా వైరస్ సోకిన ఆటగాడితో మ్యాచ్ లు ఆడించింది.

 ఇది కాస్త టాక్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల కోవిడ్ తో మ్యాచ్ ఆడిన జోష్ ఇంగ్లీస్ ఏకంగా ఆస్ట్రేలియా తరఫున విరోచితమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో 43 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇక అతను ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఏకంగా టి20 తరహాలో రెచ్చిపోయి ఆడాడు జోష్ ఇంగ్లీస్. దీంతో వెస్టిండీస్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 38.3 ఓవర్లలోనే చేదించింది. 8 వికెట్ల తేటలతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: