5 వికెట్ల ప్రదర్శనలతో.. చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా బౌలర్?

praveen
సాధారణంగా బౌలర్లు ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రతి బంతికి వికెట్ దక్కించుకోవాలి అనే పట్టుదలతోనే బంతిని సందించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక ఇలా ప్రతి బంతికి వికెట్ దక్కించుకోవడం అంటే అది జరిగే పని కాదు. కనీసం ఓవర్లో ఒక వికెట్ అయినా దక్కితే చాలు అని అనుకుంటూ ఉంటారు బౌలర్లు. ఈ క్రమంలోనే ఎప్పుడు వైవిద్యమైన బంతులు సంధిస్తూ అటు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను తికమక పెట్టి వికెట్ దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇలా ఎవరైనా బౌలర్ అత్యుత్తమమైన ప్రదర్శన చేసి ఐదు వికెట్ల హాల్ సంపాదించాడు అంటే చాలు ఇక అతని పేరు వరల్డ్ క్రికెట్లో మారుమోగిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అలాంటిది ఏకంగా సింగిల్ ఎడిషన్లో ఒక్కసారి కాదు ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు అంటే చాలు అతని ప్రతిభకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఫిదా అవుతుంది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఇలాంటి ఒక అరుదైన ఘనతను సాధించాడు దక్షిణాఫ్రికా బౌలర్ క్వెనా ముఫాక. ఏకంగా సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో అతని బౌలింగ్కు సమాధానం చెప్పే బ్యాటర్ లేకుండా పోయారు అని చెప్పాలి.

 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఐదు వికెట్ల హాల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఇక రికార్డుల మీద రికార్డులు కొల్లగోడుతున్నాడు అని చెప్పాలి  సింగిల్ ఎడిషన్లో మూడుసార్లు 5 వికెట్ల హాల్ ప్రదర్శనలు చేసి రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అండర్ 19 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ బౌలర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. 17 ఏళ్ళ ముపాక జింబాబ్వే పై ఐదు, వెస్టిండీస్ పై ఐదు, శ్రీలంక పై ఆరు వికెట్లు తీశాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లలో ఏకంగా 18 వికెట్లు పడగొట్టారు అని చెప్పాలి  ఈ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు  ముప్పాక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: