ఇలాంటి రికార్డ్.. జేమ్స్ అండర్సన్ కే సాధ్యమేమో?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండు టీం ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో అటు వరల్డ్ క్రికెట్లో మోస్ట్ సీనియర్ ఫేసర్గా కొనసాగుతున్న జేమ్స్ అండర్సన్ కూడా భాగమయ్యాడు అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్టు లో పరవా లేదు అనిపించిన అండర్సన్ ఇక రెండో టెస్టులో కూడా బరిలోకి దిగాడు.

 ఈ క్రమంలోనే విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో జేమ్స్ అండర్సన్  ఆడుతూ ఉండగా మరో ఇద్దరు యంగ్ స్పిన్నర్లు కూడా ఇదే మ్యాచ్లో ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక ఈ రెండో టెస్టు మ్యాచ్ ఒక అరుదైన ఘటనకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఇంగ్లాండ్ జట్టులో సీనియర్ బౌలర్గా కొనసాగుతున్న జేమ్స్ అండర్సన్  అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం  చేసిన సమయంలో పుట్టిన ఇద్దరు కుర్రాళ్ళు ఇక ఇప్పుడు అదే ఇంగ్లాండు జట్టు తరుపున ప్రాతినిధ్యం భావిస్తూ ఉండడం గమనార్హం.

 విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్ సీనియర్ ఫేసర్  అండర్సన్ తో పాటు స్పిన్నర్లు బషీర్, అహ్మద్ కూడా ఆడుతూ ఉన్నారు. అయితే అండర్సన్ 2003 మే లో అటు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు అని చెప్పాలి. అయితే అదే ఏడాది అక్టోబర్లో యంగ్ స్పిన్నర్ బషీర్ జన్మించాడు. ఇక 2004లో అహ్మద్ జన్మించాడు. ఇలా ఏకంగా జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన సమయంలో పుట్టిన ఇద్దరు యంగ్ క్రికెటర్లు ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వవిస్తుంటే.. ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్స్ తో కలిసి ఆడుతున్నాడు జేమ్స్ అండర్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: