ఆ ఒక్క పరుగు.. నా ఆలోచననే మార్చేసింది : సచిన్

praveen
కేవలం ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే కాదు అటు వరల్డ్ క్రికెట్లో కూడా క్రికెట్ దేవుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఏకంగా అతిపిన్నవయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం  చేసిన సచిన్ టెండుల్కర్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే కేవలం ప్రాతినిధ్యం వహించడమే కాదు.. తన అత్యుత్తమమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఇక సచిన్ ను మించిన క్రికెటర్ మరొక్కరు లేరు అనే రీతిలో ఆయన సాధించిన రికార్డులు ఉంటాయి అని చెప్పాలి.

 అయితే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది. అయినప్పటికీ ఇక ఆయన కెరియర్ లో సాధించిన రికార్డులు ఇప్పటికి ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు  కొన్ని రికార్డులకు అయితే ఏ ప్లేయర్ కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా పరుగుల వరద పారించాడు సచిన్ టెండూల్కర్. అందుకే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది యువకులు కూడా క్రికెట్ ను ఫ్యాషన్ గా మార్చుకొని ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి.

 కెరియర్ లో ఎన్నో వేల పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఒకే ఒక పరుగు తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిన్నప్పుడు కాలనీ జట్టు నుంచి బరిలోకి దిగి సున్నాకి అలావుట్ అయినట్లు సచిన్ వెల్లడించాడు. ఆ తర్వాత మ్యాచ్ లోను డకౌట్ అయ్యాను అంటూ తెలిపాడు. అయితే ఈ రెండు మ్యాచ్ లలో బాగా ఆడతానని నమ్మకంతో స్నేహితులందరినీ కూడా మ్యాచ్ చూడటానికి పిలిచాను. అయితే రెండు మ్యాచ్ లలో డకౌట్ కావడంతో తర్వాత మ్యాచ్ కు వారిని పిలవలేదు   అయితే మూడో మ్యాచ్లో ఐదు లేదా ఆరు బంతులు ఆడి ఒక రన్ చేశాను. ఆ ఒక్క పరుగు నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఆ ఒక్క పరుగు నా ఆలోచన విధానాన్ని మార్చేసింది అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: