సర్పరాజ్ ఆట కోసం ఎదురుచూస్తున్నా : ఏబీడి

praveen
ఇటీవల కాలంలో దేశవాళి క్రికెట్లో సంచలన ఆట తీరుతో భారత సెలెక్టర్ల చూపును ఆకర్షించి ఇక జాతీయ జట్టులోకి వచ్చేస్తూ ఉన్నారు ఎంతోమంది యాంగ్ క్రికెటర్లు. ఇక అతి తక్కువ సమయంలోనే భారత జట్టులోనూ సత్తా చాటి తమ స్థానాన్ని సుస్థిర చేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఒక ఆటగాడు విషయంలో మాత్రం ఇది జరగలేదు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. అయితే అతన్ని కావాలనే సెలెక్ట్ చేయడం లేదు అని విమర్శలు వచ్చినా.. సెలెక్టర్లు మొండిపట్టు మాత్రం విడలేదు. ఇక ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత సెలెక్టర్లు ఎట్టకేలకు ఆ ఆటగాడు పై మొండిపట్టు వీడారు.

 ఇటీవల భారత జట్టులోకి సెలక్ట్ చేశారు. ఆ ఆటగాడు ఎవరో కాదు సర్ఫరాజ్ ఖాన్ . దేశవాళి క్రికెట్లో దాదాపుగా 4000 పరుగులు చేసిన ఇతగాడికి ఇప్పుడు వరకు టీమ్ ఇండియాలో ఆడే ఛాన్స్ మాత్రం దక్కలేదు. ఇక ఎన్నోసార్లు జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూసిన నిరాశ ఎదురయింది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్ కు అదృష్టం వరించింది. సెలెక్టర్లు రెండో టెస్టులో అతనికి అవకాశం కల్పించారు.

 సర్ఫరాజ్ ఖాన్ తో పాటు సౌరబ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ ని కూడా బీసీసీఐ జట్టులో చేర్చింది. అయితే సర్ఫరాజ్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయం గురించి సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబి డివిలియర్స్ స్పందించాడు. సర్ఫరాజ్ డెబ్యూ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 66 ఇన్నింగ్స్ లోనే 3912 పరుగులు బాదాడు. ఇందులో 14 సెంచరీలు కూడా ఉన్నాయి  అతను అంతర్జాతీయంగా కూడా సత్తా చాటాలి అంటూ ఏబి డివిలియర్స్ వాక్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: