కోహ్లీని అందుకోవడం.. అంత ఈజీ ఏం కాదు : పాటిదార్

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడూ భారత జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక నేటి తరానికి విరాట్ కోహ్లీని మించిన లెజెండ్ అంతర్జాతీయ క్రికెట్లో మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే పరుగుల ప్రవాహం అంటే ఎలా ఉంటుందో తన బ్యాట్ తో చేసి చూపించాడు. ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టేశాడు.

 ఇప్పటికే ఎన్నో వేల పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగా ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేయాలనే కసి విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ఆట తేరే అందరిలో కెల్లా విరాట్ కోహ్లీని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి. అయితే ఫార్మాట్ తో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ ఎప్పుడు అద్భుతం ప్రదర్శన చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా క్రికెట్లోకి అరంగేట్రం చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి భారత యంగ్ ప్లేయర్ రజత్ పాటిదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

 విరాట్ కోహ్లీ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం చాలా కష్టం అంటూ భారత యంగ్ బ్యాటర్ రజాత్ పాటిదార్ పేర్కొన్నాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్టులో అతడు ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రజాత్  ఇంటర్వ్యూను బీసీసీఐ ఇక తమ సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేసింది. అయితే టెస్టుల్లో టీమ్ ఇండియా తరఫున ఆడాలనే కల ఇప్పుడు నెరవేరింది. ఇండియా ఏ తరఫున బాగా ఆడటంతో ఇక ఇప్పుడు ఈ ఛాన్స్ దక్కింది. తుది జట్టులో చోటు లభిస్తే సద్వినియోగం చేసుకుంటా. అయితే భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఆయన ఒక లెజెండ్ అంటూ రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: