అభిమాని రిక్వెస్ట్.. రిప్లై ఇచ్చిన రిషబ్ పంత్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ నే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇంకొంతమంది ఏకంగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీకు అంతర్జాతీయ క్రికెట్లో ఎవరైనా ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఇక అతని అభిమానిగా మారిపోతూ ఉంటారు చాలామంది క్రికెట్ ప్రేక్షకులు.

 ఈ క్రమంలోనే తాము ఎంతగానో అభిమానించే క్రికెటర్ ను జీవితంలో ఒక్కసారైనా కలిస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక అలాంటి అవకాశం వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే కొంతమంది స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో తమ అభిమాన క్రికెటర్ ను కలవడానికి ఏకంగా సెక్యూరిటీని దాటుకొని మరి మైదానంలోకి పరుగులు పెట్టడం చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఇక సోషల్ మీడియాలో తమ అభిమాన క్రికెటర్ నుంచి రిప్లై వస్తుందేమో అని నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్.

 ఇలా ఎన్నో రోజులుగా నిరీక్షణగా ఎదురుచూస్తున్న సమయంలో ఏకంగా తమ ఫేవరెట్ క్రికెటర్ సోషల్ మీడియాలో ఫ్యాన్ పోస్టుకు స్పందిస్తే ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఇక ఇటీవల రిషబ్ పంత్ అభిమానికి కూడా ఇలాంటి ఒక అనుభవమే ఎదురయింది. ఇటీవలే రిషబ్ పంత్  ఒక అభిమానికి అలాంటి జ్ఞాపకాన్ని ఇచ్చాడు. ఓ అభిమాని దాదాపు 99 రోజులుగా తన పోస్ట్ కి రిప్లై ఇవ్వాలి అంటూ రిషబ్ పంత్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అయితే ఫైనల్ గా అభిమాని పోస్ట్ పై స్పందించిన రిషబ్ పంత్.. మీరు బానే ఉన్నారని అనుకుంటున్నాను అంటూ స్పందించారు. దీంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: