రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన.. బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు?

praveen
దేశవాళీ క్రికెట్లో బీసిసిఐ ఎన్నో రకాల టోర్నిలు  నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఇక ప్రతి ప్లేయర్ ప్రతిష్టాత్మకంగా భావించే టోర్నీ మాత్రం రంజీ ట్రోఫీ అని చెప్పాలి. అయితే ఇప్పుడంటే ఐపీఎల్ కి క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఒకప్పుడు జాతీయ జట్టు తరఫున చోటు దక్కకపోయినా పర్వాలేదు. కానీ కనీసం రంజీ ట్రోఫీలో అయిన తమకు చోటు దక్కితే బాగుండు అని కోరుకునే వారు ఎంతోమంది ప్లేయర్లు. ఇక మొదట రంజీ ట్రోఫీని లక్ష్యంగా పెట్టుకుని ఆ తర్వాతే జాతీయ జట్టు గురించి ఆలోచించేవారు. అయితే భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కౌన్ ప్రవీణ్ తాంబే మూవీ చూస్తే అప్పట్లో రంజీలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉండేదో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.

 అందుకే ఇక రంజీ ట్రోఫీలలో బాగా రానించాలని ఇప్పటికి కూడా ఎంతోమంది యంగ్ క్రికెటర్లు భావిస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని భారత సెలెక్టర్ల చూపును ఆకర్షించి టీం ఇండియాలోకి రావాలని ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా వరుసగా మ్యాచ్లు జరుగుతున్నాయ్. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో ఎంతోమంది యువ ఆటగాళ్ళు సత్తా చాటుతూ ఉన్నారు. సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక ఆటగాళ్ల ప్రదర్శనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు కూడా రంజీ ట్రోఫీలో ఇరగదీస్తున్నాడు.

 ఇటీవల 12th ఫెయిల్ అనే సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా రంజీ ట్రోఫీలలో ఆడుతున్నాడు.అయితే వరుసగా మ్యాచ్లలో సెంచరీలతో చెలరేగిపోతున్నాడు  ఈ క్రమంలోనే సెంచరీలు చేయడంలో ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి నాలుగు మ్యాచ్లలో సెంచరీ చేసిన తొలిప్రేయర్ గా అగ్ని చోప్రా చరిత్ర సృష్టించాడు. అగ్ని సిక్కింపై రెండు ఇన్నింగ్స్ లలో (166, 92) నాగాలాండ్ పై (166, 176 ) అరుణాచల్ ప్రదేశ్ పై (114, 10 ) మేఘాలయాపై (105, 101 ) స్కోర్ లు చేశాడు. ఇక దీనిని షేర్ చేసిన ఆయన తల్లి అనుపమ్ చోప్రా తల్లిగా నేను గర్విస్తున్నాను అంటూ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: