వార్నీ.. అతను సర్ఫరాజ్ చెప్పినట్లుగానే ఆడుతున్నాడే?

praveen
ఈ ఏడాది జూన్ నెలలో టి20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 ప్రపంచ కప్ కి మందు ఇక ఇప్పుడు మరో ప్రపంచకప్ ప్రేక్షకులను అలరిస్తుంది అదే కుర్రాళ్ల ప్రపంచకప్. అదేనండి అండర్ 19 ప్రపంచకప్. ప్రస్తుతం అండర్ 19 ప్రపంచకప్ లో భాగంగా జరుగుతున్న వరుస మ్యాచ్ లు ప్రేక్షకులందరికీ  కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో భారత్ కుర్రాళ్ళు కుమ్మేస్తూ ఉన్నారు. జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు ఎలా అయితే ఒక్క ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకుపోయిందో.. ఇక ఇప్పుడు భారత అండర్ 19 జట్టు కూడా ఇలాగే అదరగొట్టేస్తూ ఉంది. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా ప్రతి మ్యాచ్ లో కూడా 200 పరుగులకు పైగా తేడాతో విజయం సాధిస్తూ అదరగొడుతుంది టీమిండియా. అయితే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో కూడా భారత జట్టు మరోసారి విజయాన్ని సాధించింది.

 200 పరుగులకు పైగా తేడాతో ఏకంగా భారీ విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. కాగా ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ముషీర్ ఖాన్ ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు. 126 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు మూడు సిక్సర్లు ఉండటం గమనార్హం. దీంతో అతని వీరోచితమైన సెంచరీ గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు దేశవాళి క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు కావడం గమనార్హం. అయితే తనకంటే తన సోదరుడు ముషీర్ మంచి బ్యాటర్ అని అతని నుంచి నేను ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నాను అంటూ సర్ఫరాజ్ చెప్పాడు. ఇక అతను చెప్పినట్లుగా ముషీర్ ఖాన్ అదరగొడుతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: