విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్.. టీమిడియా గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ లో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం టెస్ట్ మ్యాచ్ జరగడం గమానార్హం. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో అదరగొడుతుంది అనుకున్న టీం ఇండియా చివరికి తడబాటుకు గురైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ చేతిలో 28 పరుగులు తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు ఓటమితో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.

 నిజంగా సొంత గడ్డం మీద కూడా అటు భారత జట్టు రాణించకపోతే ఇక రానున్న రోజుల్లో  ఎలా రాణించగలరు అంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది భారత క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మొదటి మ్యాచ్ లో ఏదో జరిగింది జరిగిపోయింది. కానీ రెండవ మ్యాచ్లో అయినా భారత జట్టు అద్భుతంగా రానించాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే రెండో మ్యాచ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తున్న విశాఖ స్టేడియంలో భారత జట్టు గత రికార్డులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు.

 కాగా ఫిబ్రవరి 2వ తేదీన రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది అన్న విషయం తెలిసిందే. విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో టీమిండియా మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ స్టేడియంలో టీం ఇండియాకు మంచి రికార్డు ఉంది. విశాఖ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. రెండింటిలో కూడా విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్లపై ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. మరి రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఎలా రానిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: