టెస్ట్ జట్టులో సర్ఫరాజ్.. కానీ ఆ విషయంపై భయపడుతున్న ఫ్యాన్స్?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ ఆటగాళ్లదే హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. దేశవాళి టోర్నీలలో బాగా ఆడుతున్న ప్లేయర్లకు అటు సెలెక్టర్లు వరుసగా అవకాశాలు ఇస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే మూడు ఫార్మట్లలో కూడా యంగ్ ప్లేయర్లకే పెద్ద పీట వేస్తూ ఉన్నారు సెలెక్టర్లు. దీంతో గత కొంతకాలం నుంచి ఇక భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన కూడా జట్టులో కొత్త ఆటగాళ్లు ప్రత్యక్షమవడం చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ మంది ఆటగాళ్లను భారత జట్టు కోసం ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో మాత్రం కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం దక్కుతుంది.

 దీంతో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ ఇక ఆయా యువ ఆటగాళ్లకు తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదా అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఏకంగా ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్ట్ కోసం ఎంపికైన సర్ఫరాజ్ కాన్ విషయంలో కూడా ప్రతి ఒకరికి ఇలాంటి అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న  సెలెక్టర్లు అతని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇంగ్లాండుతో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం అతన్ని జట్టులోకి ఎంపిక చేశారు.

 గాయం కారణంగా కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు టీమిండియాకు దూరం కావడంతో ఇక ఎన్నో రోజుల నుంచి టీమ్ ఇండియాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ కు బీసీసీఐ అవకాశం కల్పించింది. అయితే ఇక అతనికి టీమిండియాలో ఛాన్స్ రావడంతో అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇక జట్టు కోసం ఎంపికైన అతనికి తుదిచెట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నో రోజుల నుంచి అతని పట్టించుకోని సెలెక్టర్లు ఇప్పుడు సెలెక్ట్ చేసినా.. తుది జట్టులోకి తీసుకోరని కొంతమంది అంటున్నారు. అయితే ఇన్నాళ్లకు కనికరించి అతని జట్టులోకి తీసుకున్న సెలెక్టర్లు తప్పకుండా తుది జట్టులో ఛాన్స్ ఇస్తారని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: