కోహ్లీ నాపై ఉమ్మేసాడు.. సౌత్ ఆఫ్రికా మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆటగాళ్లు ఎంతో సహనంతో ఉండాల్సి ఉంటుంది. విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం.. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అంతేకాదు ప్రత్యర్థి ఆటగాళ్ల విషయంలో ఎప్పుడూ కూడా క్రీడా స్ఫూర్తితోనే వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం జట్టును గెలిపించుకోవాలి అనే కసితో ఇక కొంతమంది ఆటగాళ్లు కంట్రోల్ కోల్పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవకు దిగుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇలా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ  భరితంగా జరుగుతున్న సమయంలో ప్రత్యర్థులతో ఎక్కువగా గొడవకు దిగే క్రికెటర్ ఎవరు అంటే చాలామంది విరాట్ కోహ్లీ పేరే చెబుతూ ఉంటారు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీలో 100 రెడ్ బుల్స్ ఒకేసారి తాగినంత ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఇక జట్టును గెలిపించాలి అనే కసితో కొన్ని కొన్ని సార్లు కంట్రోల్ కోల్పోయి ప్రత్యేక టీమ్స్ ఆటగాళ్లతో గొడవ పడుతూ ఉంటాడు. ఇలా విరాట్ కోహ్లీ కెరియర్ లో ఇలాంటి గొడవలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా గొడవ పడటం ఇక ఆ తర్వాత సదరు ఆటగాడికి సారీ చెప్పడం విరాట్ కోహ్లీకి అలవాటు.

 అయితే విరాట్ కోహ్లీతో జరిగిన ఒక గొడవ గురించి సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన కామెంట్స్ చేశాడు. ఏకంగా విరాట్ కోహ్లీ తనపై ఉమ్మేసాడు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. 2015లో టెస్ట్ మ్యాచ్ కోసం తొలిసారి నేను భారత్ వచ్చాను. అయితే అశ్విన్, జడేజా బౌలింగ్ ఎదుర్కోవడం నాకు ఎంతో కష్టంగానే మారిపోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేసాడు. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది.ఇక నా భాషలో నేను బూతులు తిట్టాను. కోహ్లీ కూడా నన్ను తిట్టాడు. బ్యాట్ తో కొడతానని కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాను. తర్వాత రెండేళ్లకి విరాట్ కోహ్లీ నాకు సారీ చెప్పాడు అంటూ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు ఎల్గర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: