టీమిండియా ఓటమి.. పుజారాను తలచుకుంటున్న ఫ్యాన్స్?

praveen
గత కొంతకాలం నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంది అనే విషయం తెలిసిందే. అయితే టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఇక ప్రతిసారి తడబడుతూ వస్తుంది టీమిండియా. అయితే యువ ఆటగాళ్ల రాకతో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరున్న చాటేశ్వర పూజార, అజింక్య రహని లాంటి ప్లేయర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు ఛాన్సులు ఇస్తున్నారు అని చెప్పాలి. అయితే యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం మంచిదే. కానీ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేకుండా టీమిండియా ఆడిన ప్రతి టెస్టు సిరీస్ లో కూడా పేలవ ప్రదర్శన కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. ఒక్కరు కూడా టెస్ట్ ఫార్మర్ కు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు.

 వెరసి ఇక ఈ సీనియర్ ప్లేయర్లు లేకుండా భారత జట్టు ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లో కూడా ప్రదర్శనతో విఫలమవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కూడా భారత ఆట తీరు ఎంతో పేలవంగా సాగింది అని చెప్పాలి. ఒక్కరు కూడా చెప్పకొద్దగా ప్రదర్శన చేయలేదు. బౌలింగ్ లో కూడా తేలిపోయారు అని చెప్పాలి. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడు ఓడిపోనీ ఉప్పల్ స్టేడియంలో మొదటిసారి టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 అయితే తొలి టెస్ట్ మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తుంది అనుకున్న టీమిండియా చివరికి ఓడిపోవడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మరోసారి టీమిండియా నయా వాల్ అయినా పూజార ని గుర్తు చేసుకుంటున్నారు. తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. అయితే ఆ స్థానంలో పూజారను ఆడించి ఉంటే బాగుండేది అంటూ క్రీడాభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. ఇటీవల రంజి ట్రోఫీలో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయిన పూజార స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని వికెట్ల పతనాన్ని అడ్డుకునేవాడు అంటూ అభిప్రాయపడుతున్నారు. గిల్, జైష్వాల్ లాంటి అనుభవం లేని ఆటగాళ్ల కారణంగానే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: