వరల్డ్ కప్ లో నేను 5 సెంచరీలు చేశా.. కానీ ఏం లాభం : రోహిత్

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి ప్రపంచ కప్ టోర్నీలో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంది టీమిండియా. అయితే లీగ్ దశలో అదరగొట్టేస్తుంది. కొన్ని కొన్ని సార్లు నాకౌట్ మ్యాచ్లో కూడా సూపర్ అనిపించుకుంటుంది. కానీ కీలకమైన మ్యాచులలో మాత్రం చేతులెత్తేస్తూ చివరికి టైటిల్ గెలవాలనే కలను కలగానే మిగిల్చుకుంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు ఎంత అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ ఇక భారత జట్టుకు టైటిల్ అందించాలి అనే కలను మాత్రం నెరవేర్చలేక పోతున్నారు. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీలో గెలిచిన వరల్డ్ కప్ తప్ప ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ ను అందించలేకపోయాడు. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలిచి తీరుతాం అని అందరు నమ్మకం పెట్టుకున్నారు. టీమిండియా జోరు చూస్తే అందరిలో నమ్మకం మరింత పెరిగిపోయింది. కానీ ఫైనల్లో ఓడిపోయిన టీం ఇండియా మళ్లీ నిరాశపరిచింది.

 అయితే రోహిత్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కూడా వరల్డ్ కప్ టైటిల్ గురించి ప్రశ్న ఎదురవుతుంది. ఇదే విషయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారధిగా తాను భారత జట్టులో ఒక మార్పు తీసుకువచ్చాను అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇండియాలో మనం నెంబర్స్ గురించి మాట్లాకుంటాం. కానీ అవి అంత ముఖ్యం కాదు. నేను 2019 వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు చేశాను. కానీ ఏమైంది.. చివరికి ప్రపంచకప్ ఓడిపోయాం.. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లందరూ కూడా వ్యక్తిగత మైళ్ళు రాళ్ల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఎంతో ఫ్రీగా ఆడుతున్నారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: