మనకి టైం వస్తుంది.. వరల్డ్ కప్ టైటిల్ పై రోహిత్ కామెంట్స్ వైరల్?

praveen
వరల్డ్ క్రికెట్లో ఎన్నో టీం టీమ్స్ ఉన్నాయి అందులో పటిష్టమైన జట్లుగా పేరు సంపాదించుకున్న టీమ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటిగా కొనసాగుతుంది భారత జట్టు. ఏకంగా ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ అటు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. బీసీసీఐ ఎంత చెబితే అంత అన్న విధంగా ఐసిసి వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే అటు భారత జట్టు కూడా ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అగ్రశ్రేణి టీం గా అభిమానులను సంపాదించుకుంటుంది అని చెప్పాలి. ఎప్పుడు ప్రత్యర్ధులను వణికిస్తూ మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ ఉంటుంది.

 అలాంటి భారత జట్టుకు ఎందుకో గత పుష్కరకాల నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది కేవలం కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచారు. ఇక అప్పటి నుంచి కోహ్లీ కెప్టెన్సీ చేపట్టడం కోహ్లీ తర్వాత రోహిత్ సారధ్య బాధ్యతలు అందుకోవడం జరిగింది. కానీ అటు వరల్డ్ కప్ కల మాత్రం నెరవేరలేదు. గత ఏడాది దాదాపు వరల్డ్ కప్ గెలిచినంత నమ్మకాన్ని కలిగించిన భారత్ చివరికి ఫైనల్లో ఓడిపోయి నిరాశపరిచింది. అయితే ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమె లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది.

 అయితే గడిచిన పదేళ్ల కాలంలో భారత జట్టు ఐసీసీ  టోర్ని గెలవకపోవడం గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల స్పందించాడు. టీమిండియాకి కూడా టైం వస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. గత మూడేళ్లుగా అద్భుతంగా ఆడుతున్న వైసీసీ టోర్నీలలో ఫైనల్స్ దగ్గర తప్పితే దాదాపు అన్ని మ్యాచ్ లలో గెలిచాం. టైటిల్ గెలిచే సమయం కూడా వస్తుంది. అప్పటివరకు పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండాలి. గతాన్ని మార్చలేము.. అందుకే మా భవిష్యత్తు పైన దృష్టి పెట్టి మున్ముందు మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తామంటూ రోహిత్ శర్మ చెప్పుకోవచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: