రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేసిన.. హైదరాబాద్ బ్యాట్స్ మెన్?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశవాళీ టోర్నీ రంజి ట్రోఫీ ప్రస్తుతం జరుగుతుంది. ఈ రంజీ ట్రోఫీలో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్ళు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు అని చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెలెక్టర్ల చూపును ఆకర్షించడమె లక్ష్యంగా పెట్టుకుని దూసుకుపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలలో భాగంగా జరుగుతున్న మ్యాచులలో ఆయా యంగ్ ప్లేయర్లు చేస్తున్న ప్రదర్శనతో వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ నుంచే దూకుడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి పై పూర్తిగా ఒత్తిడి పెంచేస్తున్నారు.

 ప్రత్యర్థి టీం ఎవరైనా సరే లెక్కచేయకుండా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి హైదరాబాద్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఏకంగా తన్మయ్ అగర్వాల్ అయితే త్రిబుల్ సెంచరీ చేశాడు. అది కూడా 163 బంతుల్లోనే ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. టి20 తరహాలో బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను సాధించిన ట్రిపుల్ సెంచరీ  గురించే అందరూ చర్చించుకుంటూ.. అతని బ్యాటింగ్ ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే ఈ అద్భుతమైన బ్యాటింగ్ తో అతను అరుదైన రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి.

 ఏకంగా క్రికెట్ లెజెండ్ గా కొనసాగుతున్న రవి శాస్త్రి రికార్డును బ్రేక్ చేశాడు యంగ్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్. 39 ఏళ్ల క్రితం దేశవాళి క్రికెట్లో రవి శాస్త్రి 123 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అయితే ఈ రికార్డును బద్దలు కొట్టాడు తన్మయ్ అగర్వాల్. 119 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లలో అతను మొత్తంగా 181 బంతుల్లో 366 పరుగులు చేశాడు. ఇందులో 34 ఫోర్లు 26 సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనే వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా తన్మయ్ అగర్వాల్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: