జైస్ బాల్ ముందు.. 'బజ్ బాల్' తేలిపోయిందిగా?

praveen
ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు భారత పర్యటనకు వచ్చింది. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత ఆటగాళ్లు వీరవిహారం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. భారీగా పరుగులు చేస్తూ సత్తా చాటుతున్నారు.

 కొంతమంది ఆటగాళ్లు అయితే ఏకంగా టి20 తరహాలో వీరబాదుడు బాదేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కి శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులు ఔట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ యశస్వి జైష్వాల్ మాత్రం ఆరంభం నుంచి దూకుడు అయిన ఆటతీరుతో అదరగొట్టాడు. బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తనదైన దూకుడుతో 74 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో పది బౌండరీలు మూడు సిక్సర్లు ఉండటం గమనార్హం.

 అయితే ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బజ్ బాల్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బజ్ బాల్ విధానంలో ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ఇంగ్లాండ్ విజయవంతం అయ్యింది. ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకువస్తుంది. అయితే ఇప్పటివరకు ఇండియాలో మాత్రం ఈ వ్యూహాన్ని అమలు చేయలేదు. ఇటీవల  మొదటి టెస్టులో ఇదే వ్యూహంతో బరిలోకి దిగగా.. బజ్ బాల్ ఫలించలేదు. అయితే భారత ప్లేయర్ జైశ్వాల్ మాత్రం దూకుడుతో ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో జైశ్వాల్ ఆట తీరును జైష్ బాల్ అని అభివర్ణిస్తున్నారు భారత క్రికెట్ ప్రేక్షకులు. జైష్ బాల్ ముందు బజ్ బాల్ తుస్సు మంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: