గిల్ అలా చేయట్లేదు.. అనిల్ కుంబ్లే అసహనం?

praveen
ఇటీవల కాలం లో భారత జట్టు లో ఎంతో మంది యువ ఆటగాళ్ళు ఛాన్స్ దక్కించుకుంటూ సత్తా చాటుతూ ఉన్నారు అని విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తమ ఆట తీరుతో మూడు ఫార్మట్ల లో కూడా తమ స్థానాన్ని సూస్తరం చేసుకుంటున్నారు. ఇలా గత కొంత కాలం నుంచి భారత జట్టులో పాతుకు పోయిన ఆటగాడు ఎవరు అంటే శుభమన్ గిల్ అని చెప్పవచ్చు. ఏకంగా ఓపనర్ గా బరిలోకి దిగుతూ 3 ఫార్మాట్ ప్లేయర్గా మారి పోయాడు గిల్. ప్రతి ఫార్మాట్లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే గిల్ అటు జట్టు లోకి వచ్చిన తర్వాత ఇక సీనియర్ ఓపెనర్ల కెరియర్ ప్రమాదం లో పడిపోయింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంతకాల నుంచి మాత్రం గిల్ ఎందుకో అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ప్రతి ఫార్మాట్లో కూడా విఫలమవుతూ నిరాశ పరుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సెలెక్టర్లు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కాగా ఇటీవల ఇంగ్లాండ్ తో జరుగుతున్న జస్ట్ సిరీస్ లో కూడా అతనికి అవకాశం దక్కింది.

 అయితే ఇటీవలే తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆట తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఇదే విషయంపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో అతను ముందుగా నేర్చుకోవాలి.  పూజార, రాహుల్ ద్రవిడ్ లాగా గిల్ వన్ డౌన్లో రాణించాలి అంటే తప్పకుండా స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకోవాలి. స్పిన్నర్లను వదులుకునేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను రచించాల్సి ఉంటుంది అంటూ గిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: