ఇదేం కొట్టుడు బాసూ.. 43 ఓవర్లకే 500 రన్స్?

praveen
ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్లో బాల్ అనే కొత్త విధానాన్ని పాటిస్తూ ఎటాకింగ్ గేమ్ తో అదరగొడుతుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇదే ఆట తీరుతో బోల్తా పడి విమర్శలు ఎదుర్కున్నప్పటికీ ఇంగ్లాండ్ తో ఆట తీరును మాత్రం మార్చుకోవట్లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మట్ లో ఈ సరికొత్త ఆట తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బజ్ బాల్ అనే పేరును కనుగొన్న ఇంగ్లాండ్ అయిన ఇంతలా దూకుడుగా ఆడిందో లేదో కానీ ఇక ఇప్పుడు ఏకంగా రంజీలో హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రం అంతకుమించిన ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అసలైన బజ్ బాల్ అంటే ఏంటో చూపిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా వీర విహారం చేస్తున్నారు. వాళ్ళు ఆడుతుంది టెస్ట్ మ్యాచ్ కాదు ఏకంగా టి20 మ్యాచ్ ఏమో అన్నట్లుగా బ్యాటింగ్ విధ్వంసం అని కొనసాగిస్తున్నారు.

 ఇక క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా వీరవిహారం చేయడమే లక్ష్యంగా ఇక బ్యాడ్ జులిపిస్తూ ఉన్నాడు.  సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతున్న యువ ఆటగాళ్లు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకు వస్తుంది. అయితే ఇక ఇటీవల రంజీ ట్రోఫీలో అటు అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా బ్యాటింగ్లో వీర విహారం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించారు.

 ఒకరకంగా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టించారు అని చెప్పాలి. ఏకంగా ఈ మ్యాచ్ లో 500 పరుగులు చేశారు. 500 పరుగులు అనగానే ఏ 100 ఓవర్లో ఆడి ఉంటారులే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే 43.5 ఓవర్లలోనే ఏకంగా 500 పరుగులు చేశారు. మొత్తంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి.. 529 పరుగులు చేసింది. ఇక ఆ జట్టు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ ఏకంగా 323 పరుగులు చేసి త్రిబుల్ సెంచరీ తో అదరగొట్టాడు. రాహుల్ సింగ్ 185 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇలా హైదరాబాద్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో అటు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: