ఐపీఎల్ తరహాలో.. జల్లికట్టు లీగ్?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదా సీదా టి20 లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ టి20 లీగ్ గా కొనసాగుతూ ఉంది. ఇక ఎంతోమంది యువ ఆటగాళ్ల పాలిట దేవుడు ఇచ్చిన ఒక వరంలా మారిపోయింది ఈ టోర్నీ. ఎంతోమంది కష్టాలు కడలిలో మునిగి తేలుతున్న ఆటగాళ్లను కోటీశ్వరులను చేస్తున్న మంచి ఫ్లాట్ ఫామ్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ తరహాలోనే ఇండియాలో మరో లీగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఐపీఎల్ తరహా లోనే లీగ్ అనేసరికి ఇక టి20 టోర్నీ అనుకునేరు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. టి20 టోర్నీ కాకపోతే కబడ్డీ టోర్నినా ఏంటి అంటారా? అలాగే అనుకున్న మీరు పొడబడినట్లే. ఎందుకంటే మీ ఊహకందని రీతిలో ఐపీఎల్ తరహాలో ఒక లీక్ ప్రారంభం కాబోతుంది. అదే జల్లికట్టు లీగ్. ఈ న్యూస్ వినగానే కాస్త షాక్ అయ్యారు కదా.. కానీ నిజంగానే తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు లీగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. జల్లికట్టు ప్రస్తుతం తమిళ సాంప్రదాయ సాహస క్రీడగా పేరొందింది .

 ప్రతి ఏటా సంక్రాంతికి ఈ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సాంప్రదాయ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం సంకల్పిస్తుందట. ఈ క్రమంలోనే ఇందుకోసం ఐపీఎల్ క్రికెట్ తరహాలోనే ప్రతి ఏటా పోటీలు నిర్వహించాలని ఒక లీగ్ ఏర్పాటు చేయాలనుకుంటుందట. ఇక ఈ లీగ్ కోసం ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సీఎం తనయుడు ఉదయినిది స్టాలిన్ ఇటీవల వెల్లడించారు. మధురై జిల్లాలో కలయిన్నర్ సెంటినరీ ఏరు తలువదల్ అరేనా పేరుతో నిర్మించిన జల్లికట్టు స్టేడియం ని ఇటీవలే ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ ప్రారంభించారు. అయితే ఇలా ఏకంగా జల్లికట్టుకు ప్రత్యేకంగా ఒక స్టేడియంని  నిర్మించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: