మొదటి టెస్ట్ మ్యాచ్ తో.. కేఎల్ రాహుల్ అరుదైన ఘనత?

praveen
ప్రస్తుతం భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు కేఎల్ రాహుల్. తన ఆట తీరుతో ఎప్పుడు అదరగొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే జట్టులో ఎంతో మంది స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్న అసలు సిసలైన టెక్నికల్ బ్యాట్స్మెన్ మాత్రం కేఎల్ రాహుల్ అని అటు విశ్లేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు సొగసైన షాట్లు ఆడుతూ క్రికెట్ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్. అయితే గత కొంతకాలం నుంచి కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే కాదు వికెట్ కీపర్ గా కూడా భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడు.

 వికెట్ కీపింగ్ లోను తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు కేఎల్ రాహుల్. అయితే ప్రస్తుతం భారత జట్టు ఇండియా పర్యటనకు రాగా.. ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా ఈ టెస్ట్ జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కి ముందు కేఎల్ రాహుల్ ను ఒక అరుదైన రికార్డు ఊరించింది. ఏకంగా ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడాడు అంటే మూడు ఫార్మాట్లలో కూడా 50 ప్లస్ అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న కేఎల్ రాహుల్ ఇక ఈ ఘనతను అందుకున్నాడు అని చెప్పాలి. భారత జట్టు తరఫున ప్రతి ఫార్మాట్లో కూడా 50 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆరో క్రికెటర్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ అతనికి 50వది కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు 75 వన్డే మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 72 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక అతనికంటే ముందు ధోని, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అశ్విన్, రోహిత్ మాత్రమే ఈ ఘనత సాధించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: