అయోధ్యకు తీసుకువెళ్లాడని.. భర్తకు భార్య విడాకులు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా శ్రీరామ నామస్మరణ వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే శతాబ్దాల హిందువుల కల నెరవేరింది. ఏకంగా శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో ఇక రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలోనే ఈ విగ్రహ ప్రతిష్టాపన రోజు ఎంతోమంది అతిరథ మహారథులు అయోధ్యకు వెళ్లగా ఇక ఇప్పుడు సామాన్య భక్తులు కూడా శ్రీరాముడిని దర్శించుకునేందుకు భారీగా తరలి వెళ్తున్నారు.

 అయితే ఆయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున దేశమంతా ఎక్కడ చూసినా శ్రీరామ్ జైరాం అంటూ అందరూ కూడా రాముడి నామస్మరణ చేశారు. ఇక దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ప్రత్యేకంగా పూజలు చేయడమే కాదు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు అని చెప్పాలి. అయోధ్య శ్రీరాముడిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక భర్త భార్యని ఇలాగే అయోధ్యకు తీసుకువెళ్లాడు. కానీ ఇలా అయోధ్యకు తీసుకువెళ్లాడు అన్న కారణంతో భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది ఆ భార్య.

 అదేంటి అయోధ్యకు తీసుకువెళ్తే గొప్పగా ఫీల్ అవ్వాలి. కానీ విడాకులు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారు కదా. అసలు ఏం జరిగింది అంటే.. భర్త హనీమూన్ కోసం గోవాకి బదులు అయోధ్యకు తీసుకు వెళ్లడంతో భార్య విడాకులు కోరిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. భోపాల్ కు చెందిన దంపతులకు ఐదు నెలల క్రితం పెళ్లయింది. అయితే ఇరువురు తోలుత గోవాలో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. తీరా అక్కడికి వెళ్లే ఒక్కరోజు ముందు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు వెళ్దామని తీసుకువెళ్లాడు భర్త. వెళ్లేటప్పుడు ఆ ఇష్టంగానే వెళ్లిన సదరు భార్య తిరిగి వచ్చిన తర్వాత తనకు విడాకులు కావాలి అంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: