చరణ్ ఫ్యాన్స్ కి మండేలా.. జక్కన్న కామెంట్స్.. ఏమన్నాడంటే?

praveen
సాధారణం గా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టార్టర్ మూవీ చేశారు అంటే చాలు ఇక ఇందులో మా స్టార్ హీరోని ఎక్కువగా చూపించారా.. లేకపోతే మరో స్టార్ హీరోని ఎక్కువగా చూపించారా అని సినిమా చూసిన ప్రతిసారి కూడా ఆయా హీరోల అభిమానులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే తమ అభిమాన హీరోని తక్కువగా చూపించారు అని అనిపిస్తే వెంటనే సోషల్ మీడియాలో ఆ విషయం గురించి కామెంట్ చేయడం చేస్తూ ఉంటారు.

 గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి చర్చే జరిగింది. ఏకంగా రామ్ చరణ్ ను మెయిన్ హీరోగా చూపించారని కానీ అటు ఎన్టీఆర్ ను మాత్రం సైడ్ హీరో అన్నట్లుగానే చూపించారు అంటూ రాజమౌళి పై కొంతమంది నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సినిమాలో ఇద్దరిదీ సమానమైన పాత్ర అని రాజమౌళి క్లారిటీ ఇచ్చినప్పటికి ఇలాంటి వార్తలు మాత్రం ఎక్కడ ఆగలేదు. సినిమాలో రెండు పాత్రలు కూడా సినిమాకు ప్రాణమని.. ఏ ఒక్క పాత్ర లేకపోయినా సినిమా హిట్ అయ్యేది కాదు అని గతంలో జక్కన్న చెప్పుకొచ్చారు.

 అయితే ఇటీవలే మరో సారి జక్కన్నకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వగా ఏకంగా చరణ్ అభిమానులకు కోపం వచ్చేలా రాజమౌళి కామెంట్ చేసాడు అని చెప్పాలి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజమౌళికి తారక్ చరణ్ పాత్రల్లో ఏది సినిమాకి ముఖ్యం అంటూ అడగగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జక్కన్న. ఒకవేళ  కొమరం భీముడు సాంగ్ తోనే సినిమాను ఎండ్ అయిపోతే అప్పుడు రాం చరణ్ ది సైడ్ రోల్ అయిపోయి ఉండేది అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాట తో తారక్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్న అటు చరణ్ ఫ్యాన్స్ మాత్రం కోపంతో రాగిలిపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: