షాకింగ్ : ఆసియా కప్ నుండి టీమిండియా ఔట్?

praveen
ఇండియాలో క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇతర దేశాల్లో ఎక్కడా లేనివిధంగా ఇండియాలో క్రికెట్ ఆటను అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక క్రికెటర్లను ఏకంగా దైవంగా ఆరాధించే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. కొంతమంది స్టేడియం కు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి ఇష్టపడుతుంటారు. అయితే క్రికెట్ కి ఇలా క్రేజ్ ఉండడం మంచిదే. కానీ క్రికెట్ కి ఉన్న క్రేజ్ మాయలో పడి ఇతర ఆటలను పూర్తిగా మరిచిపోతున్నారు భారత క్రీడాభిమానులు.

 ఇలాంటి ఆటలలో ఫుట్బాల్ కూడా ఒకటి అని చెప్పాలి. ప్రపంచ దేశాలలో క్రికెట్ ను మించిన క్రేజ్ ని సంపాదించుకున్న ఫుట్బాల్ అటు భారత్ లో మాత్రం పెద్దగా ఆదరణకు నోచుకోవడంలేదు. అయినప్పటికీ ఎంతోమంది ప్లేయర్లు ఇక ఫుడ్ బాల్ ఆటనే తమ కెరియర్ గా మార్చుకుని ముందుకు సాగుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు భారత ఆటగాళ్లు ఇక అద్భుతమైన రికార్డులు సాధించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇలాంటివి ఎక్కడ తెరమీదకి రాదు. అయితే ఇప్పుడు ఏకంగా ఫుడ్ బాల్ ఆటలో భారత జట్టు ఓడిపోయింది. ఈ విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు.

 ఆసియా కప్ 2023 ఇటీవల ప్రారంభమైంది. ఇక భారత జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతూ ఉంది. అయితే ఇటీవల తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో చివరికి ఆసియా కప్ 2023 ఫుట్బాల్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రూప్ బి లో భాగంగా సిరియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా 1 - 0 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అయితే టోర్నీలో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన ఫైనల్ గ్రూప్ గేమ్ లో భారత జట్టు ఓడిపోవడంతో చివరికి సిరియా ముందుకు దూసుకు వెళ్ళింది. భారత్ ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: