వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై.. మొదటిసారి స్పందించిన బుమ్రా?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్ లలో ఒకటిగా కొనసాగుతున్న భారత జట్టుకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది కేవలం కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే టీమిండియా నాకౌట్ వరకు చేరుకుంటుంది. అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కానీ కీలకమైన మ్యాచులలో మాత్రం చేతులెత్తేసి చివరికి ఇంటి బాట పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది.

 అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన టీమ్ ఇండియా వరుసగా సెమి ఫైనల్ వరకు కూడా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా దూసుకుపోయింది. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ సత్తా చాటింది. సొంతగడ్డపై తమను ఎవరు ఓడించలేరు అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది టీమిండియా. దీంతో టీమిండియా జోరు చూస్తే తప్పకుండా ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంటుందని ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం టీమిండియా చివరికి ఓడిపోయింది.

 దీంతో భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఏకంగా టీమిండియా ప్లేయర్స్ అయితే కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా వైరల్ గా మారిపోయాయి. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో టీం ఇండియా ఓడిపోవడంపై బుమ్రా ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇటీవలే మొదటిసారి ఈ విషయంపై స్పందించాడు ఈ స్టార్ బౌలర్. మేం ఎంతో కష్టపడ్డాం. అన్ని మ్యాచ్లు గెలిచాము. బాగా ఆడక పోతే ఫైనల్ వరకు చేరుకోవడం సాధ్యం కాదు. మేము మంచి క్రికెట్ ఆడాం. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనేది ఆటలో భాగమే అని అనలేము. అది మమ్మల్ని బాగా హర్ట్ చేసింది. హార్ట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మరో ఆరు నెలల్లో ఇంకో వరల్డ్ కప్ ఉంది అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: