అది మనోళ్ళ సత్తా.. భారత ఆటగాళ్లకే ఐసీసీ పెద్దపీఠ?

praveen
వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లకు అవార్డులను ప్రకటించడం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ప్రతివారం మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తూ మంచి ఫామ్ కనబరిచిన ప్లేయర్లకు ర్యాంకులు మెగురు పరుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇక ప్రతి నెల అటు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను కూడా ప్రకటిస్తూ ఉంటుంది.

 ఇలా ఎప్పటికప్పుడు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూనే ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  అయితే ఐసీసీ ప్రకటించే అపార్టులను దక్కించుకోవడానికి ఎంతో మంది ప్లేయర్లు ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మూడు ఫార్మట్లలో కూడా బాగా రాణించాలని ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే 2023 ఏడాది ముగిసి ప్రస్తుతం ప్రపంచం మొత్తం 2024 ఏడాదిలో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరు కూడా కొత్తగానే క్రికెట్ ప్రారంభించారు. అయితే గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లు ను ఇక మూడు ఫార్మట్లలో కూడా విభజించి ఇటీవల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టీమ్స్ ని ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మూడు ఫార్మట్లలో కూడా ఇలా ప్లేయింగ్ జట్టును ప్రకటించింది.

 అయితే ఐసీసీ ఇటీవల ప్రకటించిన టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు సంబంధించిన టీం ఆఫ్ ది ఇయర్ 2023 టీమ్స్ లో భారత ఆటగాళ్లదే హవా కొనసాగింది. ఎందుకంటే ఈ మూడు జట్లలో కలిపి ఏకంగా భారత్ నుంచి అత్యధికంగా 12 మంది ఆటగాళ్లకు స్థానం దక్కింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఏడు మంది ఆటగాళ్ళు ఐసీసీ ప్రకటించిన టీమ్స్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ నుంచి 3, న్యూజిలాండ్ నుంచి 3, సౌత్ ఆఫ్రికా 2,  జింబాబ్వే 2,  వెస్టిండీస్ 1, శ్రీలంక 1, ఐర్లాండ్ 1, ఉగాండా నుంచి కూడా ఒక ప్లేయర్ ఐసిసి టీమ్స్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ టీమ్స్ నుంచి మాత్రం ఎవరు చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: