సూపర్ రికార్డ్.. చరిత్ర సృష్టించిన అశ్విన్?

praveen
సాధారణంగా భారత ఆటగాళ్లు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం చూస్తూ ఉంటాం. కొంతమంది ఆటగాళ్లు తమ బౌలింగ్ తో రికార్డులు కొల్లగొడితే ఇంకొంత మంది ఆటగాళ్లు బ్యాటింగ్లో అదరగొట్టేసి అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటారు అని చెప్పాలి. అయితే ఇటీవలే భారత ప్లేయర్లు ఏకంగా ఐసిసి ప్రకటించిన టీమ్ ఆఫ్ ది ఇయర్  ద్వారా ఇక అరుదైన రికార్డులు సాధించారు అని చెప్పాలి. 2023 సంవత్సరంలో మూడు ఫార్మాట్ లలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీమ్స్ లో ఉన్న ఆటగాళ్లు అందరితో ఏకంగా మూడు ఫార్మట్లలో టీం  ఆఫ్ ది ఇయర్ టీమ్స్ ని ప్రకటించింది ఐసిసి.

 అయితే ఐసీసీ ప్రకటించిన టీమ్స్ లో ఎక్కువగా భారత్ నుంచే 12 మంది ఆటగాళ్లు ఛాన్స్ దక్కించుకున్నారు అని చెప్పాలి. అయితే అటు టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా ఆపదలో ఆదుకునే ఆల్రౌండర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ కి ఐసిసి ప్రకటించిన టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలోనే ఐసిసి అతనికి ఈ అరుదైన గౌరవం ఇవ్వడంతో అతని ఖాతాలో ఒక అరుదైన రికార్డు కూడా చేరిపోయింది అని చెప్పాలి. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ తో రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన ఘనత సాధించాడు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం 2023 టెస్టు టీం ఆఫ్ ది ఇయర్ లో చోటు సంపాదించుకున్న అశ్విన్ గతంలోనూ వరుసగా రెండుసార్లు టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో స్థానం దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా మూడు ఐసీసీ టెస్టు టీంలలో భాగమైన మొదటి భారతీయ బౌలర్గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్ . మొత్తంగా అశ్విన్ ఈ ఘనతను ఏకంగా నాలుగు సార్లు సాధించడం గమనార్హం. ఇకపోతే రేపటి నుంచి ఇంగ్లాండుతో జరగబోయే టెస్టు సిరీస్ లో రాణించేందుకు ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు ఈ సీనియర్ బౌలర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: