మరో 3 సిక్సర్లు కొట్టాడా.. రోహిత్ చరిత్ర సృష్టించినట్టే?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక భారత జట్టులో విరాట్ కోహ్లీతో కలిసి ఇక జట్టును నిలబెట్టే ఒక పిల్లర్ గా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇక ఇటీవల కాలంలో ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులు కూడా ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు రోహిత్ శర్మ.

 ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో భారత జట్టు టి20 సిరీస్ ముగించుకోగా ఇక ఇప్పుడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీం ఇండియా. ఈనెల 25వ తేదీ నుంచి ఇక ఇంగ్లాండ్ టీం ఇండియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు దూసుకు వెళ్ళాలి అంటే భారత జట్టు.. ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం ఎంతో కీలకంగా మారబోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన చివరి t20 మ్యాచ్లో సెంచరీ చేసి ఎన్నో అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్న రోహిత్ శర్మ.. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో ఒక అరుదైన రికార్డు సాధించేందుకు ఎదురుచూస్తున్నాడు.

 ఇప్పటికే సిక్సర్ల వీరుడుగా గుర్తింపుని సంపాదించుకున్న రోహిత్ శర్మ.. ఏకంగా మరో మూడు సిక్సర్లు బాదాడు అంటే చాలు అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించబోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ధోని 211 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. 330 ఇన్నింగ్స్ లలో  ధోని ఈ రికార్డు సాధించాడు అని చెప్పాలి. కాగా రోహిత్ ఇప్పుడు 209 సిక్సర్లతో ఉన్నాడు. కేవలం 116 ఇన్నింగ్స్ లోనే రోహిత్ రికార్డు సాధించడం గమనార్హం. ఇక మొత్తంగా రోహిత్, ధోని కంటే ముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 180 ఇన్నింగ్స్ లలో 230 సిక్సర్లు బాది టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: