వారెవ్వా.. కోహ్లీ, రోహిత్ కు సాధ్యం కాని రికార్డ్.. పుజారా సొంతం?

praveen
భారత క్రికెట్ లో యువ ఆటకాళ్ల హవా పెరిగిపోయిన నేపథ్యంలో ఇక సీనియర్ ప్లేయర్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుని చివరికి జట్టుకు దూరమైన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అతను చటేశ్వర్ పూజార అని చెప్పాలి. ఒకప్పుడు భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా అతను హవా నడిపించేవాడు. భారత జట్టు ఏదైనా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఎవరు ఉన్నా లేకపోయినా అతను మాత్రం తప్పకుండా జట్టులో కనిపించేవాడు. ఎందుకంటే నేమ్మదైన ఆట తీరుతో టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టు తరుపున అసమాన్యమైన పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి.

 ఏకంగా టీమ్ ఇండియా నయా వాల్ అంటూ ఏకంగా ఒకప్పుడు లెజెండ్ రాహుల్ ద్రవిడ్ కి వచ్చిన ఒక ట్యాగ్ ను చటేశ్వర్ పూజార సొంతం చేసుకున్నాడు. కానీ గత కొంతకాలం నుంచి సరైన ఫామ్ లో లేకపోవడంతో సెలెక్టర్లు అతని పట్టించుకోవట్లేదు. అయితే దేశవాళి  టోర్నీలలో ఆడుతూ అతను మంచి పరుగులు చేస్తున్నప్పటికీ కూడా సెలక్టర్లు ఎందుకో పూజార ను జట్టులోకి తీసుకోవడంపై పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు అని చెప్పాలి. అయితే ఇక జట్టులో మళ్లీ స్థానం సంపాదించుకోవాలన్న కసి పూజారలో కనిపిస్తుంది. రంజీ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న వరుస మ్యాచ్ లలో సెంచరీలతో చెలరేగిపోతున్నాడు పూజార.

 ఇటీవలే ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20వేలకు పైగా పరుగులు చేసిన 4వ ఇండియన్ బ్యాట్స్మెన్ గా చట్టేశ్వర్ పూజార నిలిచాడు. సౌరాష్ట్ర, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ఇక అతను ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. అతనికంటే ముందు సునీల్ గావాస్కర్ 25,834, సచిన్ టెండూల్కర్ 25396, రాహుల్ ద్రావిడ్ 23,794 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా పూజారా కంటే ముందు స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వారికి ఇలాంటి రికార్డు సాధ్యం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: