టెస్ట్ క్రికెట్ బతకాలంటే.. అదొక్కటే మార్గం?

praveen
ఈ ఏడాది  టి20 వరల్డ్ కప్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో ఉన్న అన్ని టీమ్స్ కూడా ఈ టి20 వరల్డ్ కప్ పైన దృష్టి పెట్టాయి. ఇక వరల్డ్ కప్ లో ఆడబోయే ప్లేయర్లు ఎవరు అనే విషయంపై సెలెక్ట్ చేసే పనిలో పడ్డాయి అని దేశాల క్రికెట్ బోర్డులు. ఈ క్రమంలోనే జట్టులోని కీలక ఆటగాళ్లకు ఇక వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కాస్త తక్కువ మ్యాచ్లో ఆడించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ప్లేయర్లు t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టెస్టులు వన్డేల నుంచి కాస్తదూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం చూస్తూ ఉన్నాం.

 అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో t20 లకు ఎంతగానో ఆదరణ పెరిగిపోయిన నేపథ్యంలో.. టెస్ట్ క్రికెట్ భవితవ్యం ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకంటే ఇక ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. సుదీర్ఘంగా సాగే టెస్ట్ ఫార్మాట్ లోని మ్యాచ్లను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే ఎక్కడైనా టెస్ట్ మ్యాచ్ జరిగింది అంటే చాలు స్టేడియంలో ఇక ప్రేక్షకులు లేక పూర్తిగా అంతట ఖాళీగా కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో టెస్ట్ క్రికెట్ ను కాపాడాల్సిన అవసరం ఉందని ఎంతోమంది స్టార్ క్రికెటర్లు కూడా పిలుపునిస్తున్నారు.

 ఇలాంటి సమయంలో కొంతమంది ఏకంగా టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటూ ఉండటం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక ఇటీవల టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై వెస్టిండీస్ క్రికెటర్  జాసన్ హోల్డర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళకపోవడానికి గల కారణమే వెల్లడించాడు. ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాను అంటూ జాసన్ హోల్డర్ తెలిపాడు. ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళకపోయినంత మాత్రాన తాను టెస్టులకు దూరం అని అనుకోవద్దు అంటూ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ బతకాలి అంటే ఏడాదిలో దానికోసం నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకోవడమే ఉత్తమమైన మార్గం అంటూ చెప్పుకొచ్చాడు జాసన్ హోల్డర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: