ప్రపంచంలోనే ఎత్తైన రామ మందిర నిర్మాణం.. భారత్ లో కాదు.. ఎక్కడంటే?

praveen
ప్రస్తుతం అయోధ్య వేదికగా రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఇక ఆ తర్వాత ఎంతోమంది అతిధుల మధ్య  మహత్తర కార్యమైన శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం  రేపు అంగరంగ వైభవంగా  జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ఈ రామ మందిర ప్రారంభోత్సవంతో కొన్ని దశాబ్దాల హిందువుల కళ నెలవేరబోతుంది అని చెప్పాలి.

 అయితే ఇలా అయోధ్యలో ప్రతిష్టాత్మకమైన రామ మందిర నిర్మాణం సహకారమైన హిందువులందరూ కూడా సంతోషంలో ఉన్న వేళ రామభక్తులు అందరికీ కూడా మరో శుభవార్త అందింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రామాలయం నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది. రామాలయ నిర్మాణం అనగానే మనదేశంలోనే ఈ ఆలయం కడుతున్నారు అనుకునేరు. ఏకంగా ఆస్ట్రేలియాలో ఈ రామాలయ నిర్మాణం జరుగుతూ ఉండడం గమనార్హం. పెర్త్ లో దాదాపు 721 అడుగుల ఎత్తైన రామాలయాన్ని అంతర్జాతీయ శ్రీరామ్ వేదిక్ అండ్ కల్చరల్ ట్రస్ట్ నిర్మించడానికి సిద్ధమైంది.

 అయితే ఆలయ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 600 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో సకల హంగులతో  ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉండడం ఘమనార్హం. అయితే సాంప్రదాయం కలగలిపేలా ఆలయ ప్రాంగణంలో సుందరమైన భవనాలు సదుపాయాలతో.. ఇక ఈ రామాలయ నిర్మాణం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆలయ సముదాయంలో విభిన్న భవంతులతో పాటు రామాయణ సదరన్ లైబ్రరీ, తులసీదాస్ హాల్, యోగ, ధ్యానం వేదా లర్నింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అంతేకాకుండా మ్యూజియం వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఆస్ట్రేలియాలో హిందూ మతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ ఉండడం గమనార్హం. ఇక ఆస్ట్రేలియాలో క్రైస్తవ మతం తర్వాత మూడు శాతం మంది ప్రజలు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు  ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram

సంబంధిత వార్తలు: