క్రీడా స్ఫూర్తి విషయంలో.. మళ్లీ నన్ను క్షమించండి : అశ్విన్

praveen
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్లో అద్భుతంగా రాణించిన  భారత జట్టు ఒక త్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా రెండో సూపర్ ఓవర్ లో భారత జట్టు విజయం సాధించగలిగింది. అప్పటివరకు అటు ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పాలి. అయితే ఇక సూపర్ ఓవర్ జరిగే సమయంలో ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా జట్లలోని సీనియర్ ప్లేయర్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సూపర్ ఓవర్ జరుగుతుండగా ఆఫ్గనిస్తాన్ ఆటగాడు పరుగు తీస్తున్న క్రమంలో.. బంతి అతడి ప్యాడ్ ను తాకి దూరంగా వెళ్ళింది. దీంతో అదనంగా ఆ జట్టు రెండు పరుగులు రాబట్టుకుంది.

 దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై నబీ తో చర్చించిన వీడియోలు కూడా వైరల్ గా మారిపోయాయి. అయితే క్రీడా స్పూర్తికి విరుద్ధంగా ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ నబీ వ్యవహరించాడు అంటూ భారత అభిమానులు కామెంట్లు చేశారు  అయితే టీమిండియా వైఖరి సరైంది కాదు అంటూ భారతమాజీ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. అయితే క్రీడా స్ఫూర్తి అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే క్రికెటర్ భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కాగా అశ్విన్ కూడా ఈ విషయంపై స్పందించాడు.

 సాధారణంగా ప్రతి కథకు కూడా రెండు వైపులు ఉంటాయి. ఫీల్డ్ లో మనం ప్రభావితమైతే అసహనం రావడం సహజమే  అక్కడ మేము ఉంటే ఇలా చేయమని చెబుతారూ. ఏదేమైనా అది మన వ్యక్తిగత అభిప్రాయం. భారత క్రికెట్ అభిమానిగా చెబుతున్న వరల్డ్ కప్ నాకౌట్లో సూపర్ ఓవర్ ని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది అనుకుందాం. కేవలం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాలి. వికెట్ కీపర్ మన ప్యాడ్లను తాకేలా బంతి విసిరాడు అనుకుందాం. అప్పుడు మనం పరుగు తీయకుండా ఉంటామా.. బ్యాటర్ గా మనం రన్ చేయకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు మూడో టి20 లోను ఇదే చర్చ జరుగుతుంది   వికెట్ తీయాలని బౌలర్, పరుగులు తీయాలని బ్యాట్స్మెన్ ఆడతాడు. బంతి ప్యాడ్ లను తాగితే అది లెగ్ బై, ఒకవేళ బ్యాట్ శరీరాన్ని తాగకుండా బంతి కీపర్ వద్దకు వెళ్ళినప్పుడు పరుగులు తీస్తే అది బై, క్రీజుకు దూరంగా వెళ్తే వైడ్, బాల్ వేసినప్పుడు బౌలర్ కాలు క్రీజును దాటిన బ్యాటర్ నడము ఎత్తుపై వస్తే అది నో బాల్ అవుతుంది. అందుకే బ్యాటర్కు రన్ తీసే హక్కు ఉంది. ఇక క్రీడా స్ఫూర్తి అంటారా.. మళ్ళీ నన్ను క్షమించండి అంటూ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: