టి20 ప్రపంచ కప్ కి ముందే.. అలరించబోతున్న మరో వరల్డ్ కప్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరగబోతున్న టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా మరోసారి ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ క్రికెట్ మజా దొరకడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఇలా t20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఇక ఇప్పుడు మరో వరల్డ్ కప్ క్రికెట్ లవర్స్ ని  అలరించేందుకు సిద్ధమైంది.

 నేటి నుంచి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా కుర్రాళ్ళు తమ ప్రదర్శనతో అదరగొట్టేందుకు సిద్ధమైపోయారు. ఇక ఈ ప్రపంచకప్ టోర్నీకి అటు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే మొత్తంగా ఈ అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా 16 జట్లు బరిలోకి దిగి టైటిల్ కోసం బయట కొనసాగించబోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ 16 టీమ్స్ ని కూడా నాలుగు గ్రూపులుగా విభజించింది ఐసిసి. గ్రూపు ఏలో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ఉంది ఈ క్రమంలోనే ఈనెల 20న బంగ్లాదేశ్ 25న ఐర్లాండ్ 28న యూఎస్ఏ తో భారత్ తలబడబోతుంది అని చెప్పాలి.

 కాగా అండర్ 19 ప్రపంచ కప్ లో భాగంగా టీమ్ ఇండియాకు కెప్టెన్ గా ఉదయ్ సుహారాన్ కి  వ్యవహరించబోతున్నాడు అని చెప్పాలి. కాగా ఈ అండర్ 19 ప్రపంచ కప్ లోని అన్ని మ్యాచ్లు కూడా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మొదలవుతాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, హాట్ స్టార్ లో ఇక ఈ మ్యాచ్ లు అన్నిటిని కూడా ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wc

సంబంధిత వార్తలు: