విమానం టేకాఫ్.. టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు.. చివరికి?

praveen
సాధారణంగా బస్సు రైలు ప్రయాణాలతో పోల్చి చూస్తే విమాన ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే ఇక విమాన ప్రయాణాలకు కాస్త ఖర్చు ఎక్కువైనప్పటికీ ఎంతోమంది సౌకర్యవంతమైన ప్రయాణం కోసం విమానాలలో జర్నీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి విమానంలో ప్రయాణిస్తే.. ఒక వైపు సౌకర్యవంతమైన జర్నీతో పాటు ఇంకోవైపు ఇక టైంని కూడా సేవ్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 కానీ ఇటీవల కాలంలో విమానాలలో ప్రయాణించాలి అనుకునే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత ఫ్లైట్లో ప్రయాణించడం కంటే రైలు బస్సు మార్గం ద్వారా వెళ్లడమే బెటర్ ఏమో అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏకంగా ప్రయాణికులు 9 గంటల పాటు విమానం కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరికొన్ని ఘటనల్లో ఏకంగా విమానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఇతరులు దాడి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 విమానంలో ప్రయాణించేటప్పుడు విండో సీట్ దగ్గర కూర్చుని హాయిగా బయటకి చూస్తూ ప్రయాణం సాగిస్తే ఎంత బాగుంటుంది  కానీ ఇక్కడ ఒక పాసింజర్ కి  మాత్రం చివరికి విమాన ప్రయాణం మొత్తం టాయిలెట్ లోనే గడిచిపోయింది. ముంబై బెంగళూరు స్పైస్ జెట్ విమాన ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత టాయిలెట్ కు వెళ్లి అందులోనే చిక్కుకుపోయాడు ప్రయాణికుడు. ఎంత ప్రయత్నించినా డోరు తెరుచుకోకపోవడంతో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు ఇక టాయిలెట్ లోనే ఉండిపోయాడు. అయితే ఈ ఘటనపై క్షమాపణలు చెప్పింది స్పేస్ జెడ్. ఇక సదరు ప్యాసింజర్ కు పూర్తిస్థాయి డబ్బులు రిఫండ్ చేస్తాము అంటూ హామీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: